Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- పంజాబ్‌లో చర్చనీయాంశంగా అమృత్సర్ సీపీ ట్రాన్స్ఫర్..
- జంతర్ మంతర్-ఉగ్రకుట్ర వ్యాఖ్యలే కారణమన్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: జంతర్ మంతర్ నిరసనలపై అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు భుల్లాన్ను ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ బదిలీ చేసింది. దీనిపై బీజేపీ ప్రశ్నల్ని లేవనెత్తింది. కొద్దిరోజుల క్రితం అమృత్సర్ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాద మాడ్యుళ్లపై కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో నలుగురు మైనర్లతో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు పిస్టళ్లు, తొమ్మిది లైవ్ కార్ట్రిడ్జ్లు, నాలుగు పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భద్రతా కేంద్రాలపై నిఘా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ మాట్లాడుతూ.. అరెస్టైన నిందితులు ఢిల్లిలోని జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించారని, నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో నిరసనకారులపై పెట్రోల్ బాంబులతో దాడి చేసే కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా సంచలనంగా మారాయి.
Also Read
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
ఇప్పుడు, ఈ వ్యాఖ్యలపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థమయ్యేలా ఎంపిక చేసిన భాగాలను మాత్రమే ప్రచారం చేశారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అరెస్టైన వ్యక్తులు జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నారని లేదా నిరసనకారులకు ఉగ్రవాద మాడ్యుళ్లతో సంబంధం ఉందని కమిషనర్ ఎక్కడా చెప్పలేదని స్పష్టతనిచ్చింది.
ఈ వివాదం తర్వాత భుల్లార్‌ను బదిలీ చేయడంపై రాజకీయ చర్చ మొదలైంది. ఈ బదిలీకి జంతర్ మంతర్ వ్యాఖ్యలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ఈ బదిలీపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనను బదిలీ చేసిన సమయంపై అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. జంతర్ మంతర్ కుట్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్‌కు అసౌకర్యంగా మారాయా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!