BJP MP Soyam Bapu Rao: బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తీరు వివాదస్పదవుతోంది. తాజాగా ఎంపీ ల్యాడ్స్ నిధులను తన సొంతం చేసుకునేందుకు వాడుకున్నట్లు బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి తాము ఆలోచించలేదు, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్…
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న…
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహి జగన్ రెడ్డికి వంత పాడేందుకు శేషు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడని ఆరోపించారు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో రభస నెలకొంది. నిన్ను కేసీఆర్, కేటీఆర్ వాడుకుని వదిలేస్తారు అని మాజీ మంత్రి హరీష్ రావును రాజగోపాల్ అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మొన్న జరిగిన సభలో హరీష్ రావు... రాజగోపాల్ రెడ్డిని నీకు మంత్రి పదవి రాదు అని అన్నారు. ఈ క్రమంలో ఈ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ అది ఏమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకు వెళ్ళడానికి అని ప్రశ్నించారు?. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకు వెళ్ళండని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కవిత…
సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.