Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dancers Association : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో పెద్ద వివాదం రాజుకుంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్‌లోని మిగిలిన 23 విభాగాల (క్రాఫ్ట్స్) కార్మికులు కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ పాటించనున్నారు.
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ఫెడరేషన్ తెలిపిన వివరాల ప్రకారం—మెగాస్టార్ చిరంజీవి సలహాలను, సూచనలను, అలాగే ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలను త్రోసిపుచ్చుతూ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. సంఘంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో, గతంలో సస్పెండ్ అయిన సభ్యులను కూడా కలుపుకుని పోవాలని కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా నిర్ణయించినట్లు ఫెడరేషన్ గుర్తుచేసింది. సుమలత సారథ్యంలోని కమిటీకి ఒక అవకాశం ఇచ్చినప్పటికీ, పెద్దల మాటను ధిక్కరిస్తూ ముందుకు వెళ్లడం పట్ల ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ రోజు నుంచి డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి సహాయసహకారాలు అందించదు. ఈ అసోసియేషన్ పరిధిలో వచ్చే ఏవైనా వివాదాలు, సమస్యలు లేదా ఆర్థికపరమైన వ్యవహారాల పరిష్కారంలో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత వహించదు. ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే రాబోయే వేతన సవరణ అగ్రిమెంట్లు, ఇతర అధికారిక చర్చల్లో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ ఎటువంటి మద్దతు ఇవ్వదు. ఫెడరేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో టాలీవుడ్‌కు చెందిన మిగిలిన 23 విభాగాలు కూడా డ్యాన్సర్ల సంఘానికి సహకరించవు. ఇటీవల జరిగిన డ్యాన్సర్స్ అసోసియేషన్ అంతర్గత విభేదాలు, ఎన్నికల వివాదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ పెద్దల సూచనలను తోసిరాజనడమే ఈ చర్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఫెడరేషన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం మూలంగా భవిష్యత్తులో షూటింగ్లలో డ్యాన్సర్ల పాల్గొనడంపై, వేతన ఒప్పందాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!