శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి రెండు రాజకీయ పార్టీలు ఉండవని తెలిపారు. తెలుగుదేశం, జనసేన ఉండవని.. ఉంటే గుండు గీయించుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ని అంగడిలో సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిక పోర్టల్ అని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు.
ఓ మొసలి మరో మొసలిపై దాడి చేస్తుంది. అంతలోనే దాడి చేసిన మొసలిపై మరో మొసలి మెడపై కొరుకుతుంది. చెరువులోకి వెళ్లేందుకు పెద్ద మొసలి ప్రయత్నిస్తుండగా, మరో మొసలి దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. ఓ మొసలి తోకను పట్టుకున్న వెంటనే, మరో మొసలి మెడను పట్టుకుంటుంది. ఇలా మొసళ్ల మధ్య ఫైట్ జరుగుతుంది.
చంద్రయాన్-3 కు సంబంధించి మరొక వైరల్ న్యూస్ బయటికొచ్చింది. పాకిస్తాన్ మాజీ మంత్రికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రయాన్-3 గురించి మాట్లాడి కడుపుబ్బా నవ్విస్తాడు.