మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు.
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఈ హీరో కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరో గా నటించిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా తో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాలు…
నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు.
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ…
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు.
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు.
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు.