రాజకీయ లబ్ధి కోసం జాతీయ అవార్డులను ఉపయోగించుకోవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ఎంపికైందని ఎంకే స్టాలిన్ విమర్శించారు.
టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో…
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 15) ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. తన కళ్లలో ఏదో సమస్య కారణంగా హాజరు కాలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది ఆయన నివాసం నుంచే జెండాను ఎగురవేస్తానని చెప్పారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ నడపడానికి సినిమాలే తనకు ఇంధనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఎన్ని వేషాలు వేసినా మీరు భరించాలిసింది ఆరు నెలలు మాత్రమేనని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.