డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో ఓ పాము హల్‌చల్ చేసింది.. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది హడలిపోయారు.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యే గోదావరి భవన్‌లోకి భారీ పాము చేరడంతో ఉద్యోగులను హడలెత్తించింది.
అంగన్వాడీల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో అటు పోలీసులు ఇటు అంగన్వాడీల మధ్య వివాదం చెలరేగింది.
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి దేవేంద్రకుమార్‌ను మచిలీపట్నం కలెక్టరెట్‌లోని తన ఛాంబర్‌లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ వాహనాలను అడ్డుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత జిల్లాకు వస్తుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్ తొలుత కొమురం భీం చౌక్‌కు చేరుకుని.. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పిస్తారు.
రేపు కొమురం భీం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించనున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
KTR: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కొత్తగా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఈ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.