Snake in District Collectorate: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో ఓ పాము హల్‌చల్ చేసింది.. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది హడలిపోయారు.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యే గోదావరి భవన్‌లోకి భారీ పాము చేరడంతో ఉద్యోగులను హడలెత్తించింది. ఇదే హాల్‌లో ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే, పెద్ద పాము ఒకటి హాల్‌లోని ఫ్లైఉడ్ వెనుక ఉందని గుర్తించిన సిబ్బంది.. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు.. అక్కడికి చేరుకుని.. సుమారు రెండు గంటల పాటు శ్రమించి గణేష్ వర్మ భారీ పామును బంధించారు. దానిని జెర్రిపోతు పాముగా వర్మ గుర్తించారు. పామును పట్టుకోవడంతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పామును పట్టుకున్న గణేష్ వర్మ ను కలెక్టర్ కార్యాలయం ఏవో విశ్వేశ్వర రావు అభినందించారు. మొత్తంగా ఆ పామును చూసినప్పటి నుంచి హడలిపోయిన కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది.. ఆ పామును బంధించిన తర్వాత రిలాక్స్ అయ్యారు..
Read Also: SJ Suryah: ఆయన పదవి కోసమో పవర్ కోసం కాదు మీ కోసమే బతుకుతున్నారు!