ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ వాహనాలను అడ్డుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
Read Also: Sreemukhi: పద్ధతికి పట్టు చీరకట్టినట్లు ఏముంది రాములమ్మ
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తేనే.. ఐదు లక్షల రూపాయలు సరిపోలేదు.. కానీ ఇప్పుడు మూడు లక్షలు మాత్రమే ఇస్తే నిర్మాణానికి ఎలా సరిపోతాయని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించారు.
Read Also: Bro Movie Shoes: ‘బేబీ’ డైరెక్టర్‌కు ‘బ్రో’ షూస్.. ధర ఎంతో తెలుసా?! అస్సలు ఊహించరు
అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణం ఖర్చులు రూ. 10 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రామ సభల ద్వారా పేదలకు కేటాయించాలని పేర్కొన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించకపోతే ఆందోళనకు దిగుతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.