ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత జిల్లాకు వస్తుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్ తొలుత కొమురం భీం చౌక్‌కు చేరుకుని.. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని పూజలు చేసి దాన్ని ప్రారంభిస్తారు. తరువాత పక్కనే ఉన్న పిల్లల పార్కుకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తారు.
అనంతరం జిల్లా పోలీసు ఆఫీస్ కి వెళ్లి ఆ బిల్డింగ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సమీకృత కలెక్టరేట్ సముదాయానికి చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి కలెక్టరేట్‌ను ఆయన ఓపెనింగ్ చేస్తారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బందితో సమావేశం అవుతారు. ఆ తరువాత కలెక్టరేట్‌లోనే దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులకు భూ పట్టాలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన 12 మంది గిరిజన రైతులకు సీఎం చేతుల మీదుగా హక్కుపత్రాలను అందజేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభాలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. తిరిగి 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
Read Also: Lifestyle : భార్యాభర్తల మధ్య జరిగే రొమాన్స్ గురించి ఎవ్వరికి చెప్పకండి.. ఎందుకంటే?
సీఎం కేసీఆర్ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా జైలు సమీపంలోని ప్రేమలా గార్డెన్ వద్ద ఆరెకరాల్లో బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారు. సీఎంతో పాటు పార్టీ ముఖ్యనేతలందరూ కూర్చునేలా భారీ సభావేదికను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో పనులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామ, మండల, పట్టణాల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీటి కోసం వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. అలాగే వారికి భోజనాలు మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
Read Also: Hyderabad: పెళ్ళైన తర్వాత రోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. ఈ ట్విస్ట్ ఏంటి బాబోయ్..
సీఎం కేసీఆర్ పర్యటనకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఐజీ రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, కరీంనగర్ పీటీసీ ఎస్పీ అరవింద్‌తో పాటు 15 మంది అడిషనల్ ఎస్పీలు, 49 మంది సీఐలు, 12 మంది మహిళా ఎస్సైలు, 159 మంది ఎస్సైలు, 264 మంది ఏఎస్సైలు, 1,100 మంది పీసీలు, 109 మంది మహిళా పీసీలు, 200 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులు, 300 మంది సీఎం సెక్యూరిటీ, స్పెషల్ స్క్వాడ్ సిబ్బందితో మొత్తం 2,500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.