జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ.. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదని అన్నాడు. దిక్కుతోచని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వాపోయాడు.…
విశాఖలో మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రింగు వలల వివాదంతో నగరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్‌కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. మత్స్యకారులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా అక్కడ మంత్రులు అప్పలరాజు, అవంతి వారితో చర్చలు జరిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు…
యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఈరోజు ఉదయం నుంచి అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ధ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కుమారుడి కారు…