కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన..…
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు…
వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్నవారికి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. వాటిని వెంటనే ప్రారంభించారు.. ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను ఇప్పుడు 3,255కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారు.. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల…
మూడు రాజధానులపై ముందుకు వెళ్తున్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ఫ్లెక్సీలు ఆవిష్కరించారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇప్పుడు కాకపోతే…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇక, ఇప్పటికే రాజధానిపై తన వైఖరిని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ.. అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చేసింది.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలుచేశారు.. సీఎం వైఎస్…
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్‌జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్..…
భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా…
తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వద్దని చెప్పారని గుర్తుచేసుకున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… జిల్లా ప్రజలందరి మనసులో విశాఖపట్నం రాజధాని అంశం ఉందన్నారు.. ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాటాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చిన ఆయన.. విశాఖ రాజధాని అంశంలో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.. మంత్రి పదవికి తాను రిజైన్ చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్…