ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. నిరసనలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. సాగర నగరం ఇప్పటికే పోలీస్ వలయంలా మారింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని మోడీ.. వైజాగ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తాం.. కంచెర్లపాలెం నుండి ఓల్డ్ ఐటీఐ వరకూ కిలోమీటర్ మేర…
జనసేన పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది.. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై జనసేన పార్టీ సోషల్ ఆడిట్ చేపట్టబోతోంది… మూడు రోజుల పాటు జనసేన నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు.. రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించారు.. అంతేకాదు.. మరో ఒకట్రొండు చోట్ల కూడా పాల్గొందామా..? వద్దా..? అనే అంశంపై పవన్ కల్యాణ్…
2023 మార్చి 2,3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్నాథ్... పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా సీఎంకు లేఖలు రాస్తూ వచ్చిన రామకృష్ణ… ఈ సారి నకిలీ విత్తనాలు, నష్టపోయిన పత్తి రైతుల గురంచి తన లేఖలో ప్రస్తావించారు.. నంద్యాల కేంద్రంగానే 30 కంపెనీల పత్తి విత్తనాల సరఫరా జరిగినట్లు తెలుస్తోందని పేర్కొన్న ఆయన.. ఎకరాకు దాదాపు రూ.60…
చల్లా ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తుపై కుటుంబంతో చర్చించి సూచన చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సూచించారు సీఎం వైఎస్ జగన్.
పవన్ కల్యాణ్ ఇంటి వద్జ రెక్కీ చేస్తారా..? పవన్‌పై దాడులు చేద్దామనుకుంటారా..? ఎవరిని బతకనివ్వరా..? అందర్నీ చంపేస్తారా..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. దీని ద్వారా కొత్త తరహాలో సమస్యలు వెలికితీస్తామని వెల్లడించారు.
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.