తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేస్తున్నది అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ అంపశయ్యమీద ఉంది.. వెంటిలేటర్ తీసేయడమే మిగిలిందంటూ వ్యాఖ్యానించారు.. ఎన్టీ రామారావును వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. ప్రజల కలలోకి వచ్చి ఎన్టీఆర్ ఆత్మే చంద్రబాబు దుర్మార్గాలు చెబుతుందన్నారు.. ఇక, చంద్రబాబులో…
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. ఇదే నాకు చివరి ఎన్నిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచాయి… అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడున్నది కౌరవ సభ అని ఆరోపించారు.. ఆ కౌరవ…
ఈ ఒక్క ఎన్నికల్లో మనం గెలిస్తే... ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్లనున్నారు.. టాలీవుడ్ సూపర్ స్టార్, తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన కృష్ణ కన్నుమూయడంతో.. రేపు హైదరాబాద్ వెళ్లనున్న ఆయన.. సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.. సూపర్ స్టార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.. సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత.. మధ్యాహ్నం 2.20…
బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని.. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.. వైఎస్ జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని విపక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అధికార పార్టీ మాత్రం.. మరోసారే కాదు.. 25 ఏళ్ల పాటు వైఎస్ జగనే సీఎంగా ఉంటారంటోంది.. తాజాగా ఈ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్… తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో…
పన్ను చెల్లింపులపై చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాణిజ్య పన్నులశాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలని సూచించారు.. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత…