తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వద్దని చెప్పారని గుర్తుచేసుకున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… జిల్లా ప్రజలందరి మనసులో విశాఖపట్నం రాజధాని అంశం ఉందన్నారు.. ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాటాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చిన ఆయన.. విశాఖ రాజధాని అంశంలో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.. మంత్రి పదవికి తాను రిజైన్ చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దని చెప్పారని.. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున రాజీనామా అవసరం లేదని సీఎం జగన్ చెప్పారనన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: TTD Good News: శ్రీవారి భక్తులకు శుభవార్త..
కాగా, ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర కొనసాగిస్తుండగా.. మూడు రాజధానులు చేసి తీరుతాం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందుకు అనుగుణంగా.. నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనలో అధికార పార్టీ పాల్గొన్న విషయం తెలిసిందే.. విశాఖలో పరిపాలన రాజధాని.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని… ఇప్పుడు రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధాని చేస్తామంటూ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. విపక్షాలు అన్నీ.. రాజధానిగా అమరావతిలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.. రాజులు మారినప్పుడల్లా.. రాజధానులు మారుతాయా? అని ప్రశ్నిస్తున్నారు.