వచ్చే ఏడాది మార్చి 2,3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్నాథ్… పెట్టుబడుల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.. బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన త్వరలో చేయనున్నాం.. జనవరి 2024 నాటికి రామాయపట్నం పోర్టుకు మొదటి షిప్ వచ్చేలా పనులు త్వరితగతిన చేపడుతున్నాం అని స్పష్టం చేశారు.. కరోనా కారణంగా ఈ తరహా బిజినెస్ సమ్మిట్లు నిర్వహించలేకపోయాం.. ప్రభుత్వం ఫోకస్ చేస్తోన్న రంగాల్లో.. ఏపీలో అవకాశమున్న రంగంలో పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. స్టార్టప్స్, ఇన్నోవేషన్లకు అనువుగా ఉండేలా చూస్తున్నాం.. ఎంఎస్ఎంఈలపై సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.. అపెరల్, ఫుట్ వేర్ రంగాల్లో ఇప్పటికే పెట్టుబడులు వచ్చాయని.. ఇటీవలే ఇండియా కెమ్ సదస్సులో ఏపీ నుంచి పాల్గొన్నామని చెప్పారు.
Read Also: Governor Tamilisai vs DMK: తమిళిసైని టార్గెట్ చేసిన డీఎంకే.. గవర్నర్ కౌంటర్ ఎటాక్
ఇక, పీసీపీఐఆర్ కారిడార్లల్లో విశాఖ-కాకినాడ పీసీపీఐఆర్ కారిడార్ అతి పెద్దది అని వెల్లడించారు మంత్రి అమర్నాథ్.. పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.. రామాయపట్నం పోర్టు పనులు జరుగుతున్నాయి.. కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని భావిస్తున్నాం అన్నారు.. ఇక, ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించారు.. సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడరుగా ఉన్నా.. పెట్టుబడులు పెట్టిన కంపెనీలే బ్రాండ అంబాసిడర్లుగా చేయాలని సీఎం జగన్ సూచించారని.. ఏపీ బలాల్ని షో కేస్ చేసుకోవడంతో పాటు.. స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాం అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఎవ్వరితో పడితే వారితో ఎంఓయూలు కుదుర్చుకోబోం.. పెట్టుబడులు ఎవరైతే పెడతారో.. వాళ్లతోనే ఎంవోయూలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
అంతకుముందు విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమంలో ఈ లోగో ఆవిష్కరణ జరిగింది.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. వచ్చే ఏడాది విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది..