మాచర్లలో జరిగిన ఘర్షణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.. అయితే, చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనే.. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం కౌంటర్ ఎటాక్ దిగుతోంది.. పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారు.. ఏం జరిగిందో రాష్ట్రం చూసింది అంటూ సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ పవన్ కల్యాణ్‌కు లేదని ఎద్దేవా చేసిన ఆయనే.. వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు అధికారిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు.. మధ్యలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరవుతూ వస్తున్నారు.. ఇక, రేపు సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించనున్నారు.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకాబోతున్నారు ఏపీ సీఎం.. దీని కోసం.. రేపు ఉదయం అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11…
తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న నటుడు విశాల్.. ఇక, అతడు తెలుగువాడే కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడనే ప్రచారం సాగుతూ వస్తుంది.. అంతేకాదు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడనే గుసగుసలు కూడా వినిపించాయి.. అసలు, కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైసీపీ సర్కార్.. సీఎం వైఎస్ జగన్ కూడా కుప్పంలో పర్యటించారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా…
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఈ నెల 21న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. 21వ తేదీన బాపట్ల జిల్లాలో ట్యాబ్‌ల…
మైలవరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ హాట్‌టాపిక్ అయ్యింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడిచింది.. చివరకు అది వైసీపీ అధిష్టానం వరకు వెళ్లింది.. ఇక, వరుసగా వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతూ వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు.. ఈ సారి మన టార్గెట్ 175కి 175…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైలవరం పంచాయితీ హాట్‌టాపిక్‌గా సాగుతూ వచ్చింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తూనే ఉంది.. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.. ఇప్పటికే వైసీపీ అధిష్టానం వారిని సముదాయించే ప్రయత్నాలు చేసింది.. ఇక, పార్టీ అధినేత, సీఎం జగన్ వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రంలోని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. రేపు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి…
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. పెన్షన్ దారులకు ఆనందాన్నిచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రూ. 2,500 నుంచి రూ. రూ. 2,750కు పెంచేందుకు నిర్ణయించాం.. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 134 కోట్లు ఖర్చు అవుతుందని.. అయినే.. సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.. నిజం ఎలా ఉంటుందంటే.. జగన్‌లా ఉంటుందని…
మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు నిండడంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో…