Dr. Prem Sagar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనేక గొప్ప పనులు చేస్తున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారని ప్రశంసలు కురిపించారు ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ప్రేమ్‌సాగర్ రెడ్డి.. ప్రైమ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాలలో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, యూఎస్‌లోని టాప్…
Minister Kottu Satyanarayana: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. తాజా పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. టీడీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఇక, ఉనికి కోసమే టీడీపీ ఆరాటం.. తమ పార్టీ బతికే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు.. పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదూ బొక్కా లేదూ అనటం అంటే ఆ పార్టీ లేనట్లే కదా..? అని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యం…
అఖిలపక్ష సమావేశం ముగిసింది.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. వివిధ తీర్మానాలు చేసింది అఖిలపక్ష సమావేశం. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలపై పరిరక్ష వేదిక పనిచేయాలని తీర్మానించారు. ఇక, వైఎస్ జగన్ హయాంలో…
ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, అన్ని విభాగాలు, అన్ని కేటగిరీల ఉద్యోగులకు కూడా ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియట్ సిబ్బంది వరకు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోనున్నారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ముందుగా.. సెక్రటేరియట్,…
కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్‌లు కేంద్రంగా చికిత్స అందాలి, టెస్టింగ్, మెడికేషన్ విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలి, ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి.. పీహీచ్‌సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్‌లు పని చేయాలి అని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. కోవిడ్ వ్యాప్తి, తాజా పరిణామాలపై వివరించారు అధికారులు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల పని తీరు వంటి వాటి పై…
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రీ – సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని స్పష్టం చేసిన సీఎం.. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే.. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలి.. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని స్పష్టం…
CM YS Jagan Delhi Tour:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన వెళ్లనున్నారు.. రేపు ఢిళ్లీ వెళ్లనున్న ఆయన.. ఎల్లుండి వరకు అక్కడే గడపనున్నారు.. ఈ సారి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం జగన్.. రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం.. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ఆయన.. ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.. ఇక, రాత్రి 8.15…
ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి…
GVL Narasimha Rao: అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్లిపోయారు.. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి గంతే.. లోటస్ పాండ్‌లో కూర్చుంటారు అంటూ జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు.. వైసీపీ, టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేసే…
తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని ఇడుపులపాయకు వెళ్లిన సీఎం.. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. అనంతరం వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి…