Police Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పోలీస్ రిక్రూట్‌మెంట్ గరిష్ట వయస్సును రెండేళ్ల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం.. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. ఇప్పటికే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు)…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. అయితే, ఈ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు…
తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగసభపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలని ఉంటే మంచిది.. ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదన్న ఆయన.. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని మండిపడ్డారు.. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్లాడు.. కానీ, ఏం చేయాలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు..…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు.. ఇలా మూడు రోజులు బిజీ బిజీగా గడపనున్నారు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు శుభకార్యాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇంకోవైపు, కుటుంబ పెద్దలను, కుమారులను కోల్పోయినవారిని కూడా పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తిరుపతి, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం తిరుపతికి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం 5 .15కు తుమ్మలగుంట చేరుకోనున్నారు.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్…
రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంది సర్కార్.. ఇక, తన పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్థానం మొత్తం ముళ్లబాటే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.. జగన్ ప్రస్థానం మొత్తం ముళ్లబాటే.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కష్టాలు పడ్డారన్న ఆయన.. వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తూ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నాడు.. విద్యార్థులకు మరో శుభవార్త.. ఇప్పటికే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. పేద విద్యార్థులు కూడా అందరూ చదువుకునేలా చేసేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోన్న వస్తోంది వైసీపీ ప్రభుత్వం.. ఇక, ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1972 డిసెంబరు 21న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఓవైపు వ్యాపారం చేస్తూనే.. రాజకీయాల్లోనూ రాణించారు.. 2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని…