మైలవరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ హాట్‌టాపిక్ అయ్యింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడిచింది.. చివరకు అది వైసీపీ అధిష్టానం వరకు వెళ్లింది.. ఇక, వరుసగా వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతూ వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు.. ఈ సారి మన టార్గెట్ 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే.. దీని కోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అయితే, ఈ సమావేశం ముగిసిన తర్వాత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రితో మైలవరం నియోజకవర్గం పై సమావేశం నిర్వహించారు.. నాకు, పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారని.. మా దగ్గర నుంచి కూడా గ్రామాల్లో పరిస్థితిపై సమాచారం తీసుకున్నారని తెలిపారు..
Read Also: JP Nadda: సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..
ఇక, మేం చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోట్ చేసుకున్నారని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. చిన్న చిన్న విబేధాలు ఉంటే సర్దుకుని గత ఎన్నికల్లో వచ్చిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి రావాలని చెప్పారని వెల్లడించారు.. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని చెప్పారు.. కార్యకర్తల మధ్య సమన్వయ లోపాలు ఉంటే పరిష్కరిస్తాం అన్నారు.. నా స్థాయిలో నేను కూర్చో బెట్టి మాట్లాడతాను అని సీఎం తెలిపారన్న ఆయన.. మంత్రి జోగి రమేష్‌కు, నీకు మధ్య విబేధాలు ఉంటే వారం రోజుల్లో నా దగ్గరకు రండి అని సీఎం జగన్ అన్నారు.. ఇద్దరూ కలిసి వస్తే కప్పు కాఫీ తాగి.. వెళ్లండి అని అన్నారని పేర్కొన్నారు.. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి… అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. వచ్చే వారంలో కూర్చుంటాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయమే శిరోధార్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. కాగా, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వంసత కృష్ణ ప్రసాద్ మధ్య నడుస్తోన్న ఈ వార్.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ముగియనుందా? పార్టీ అధినేత సమక్షంలో ఎలాంటి చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.