జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం కౌంటర్ ఎటాక్ దిగుతోంది.. పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారు.. ఏం జరిగిందో రాష్ట్రం చూసింది అంటూ సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ పవన్ కల్యాణ్‌కు లేదని ఎద్దేవా చేసిన ఆయనే.. వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు కాదు.. లబ్దిదారులైన రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటే అప్పుడు జగన్ అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారన్నారు.. జగన్ కుడా నేను చేసిన సేవ బాగుంటేనే ఓటు వేయమని అడుగుతున్నారు.. ఒక్కోసారి పవన్ ఒక్కోలాగా మాట్లాడతారు.. కానీ, టీడీపీని మాత్రం ఎప్పుడూ ఒక్క మాట అనరు అని మండిపడ్డారు.
Read Also: CM YS Jagan: రేపు ప్రకాశం జిల్లాకు సీఎం జగన్
పవన్ కళ్యాణ్ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? అని అడుగుతున్నారు.. లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య శాఖ లో 40 వేల ఉద్యోగాలు పవన్‌కు కనిపించటం లేదా? అని మండిపడ్డారు సజ్జల.. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారు.. పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం అవుతుందని విమర్శించారు.. చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కల్యాణ్ ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరిన ఆయన.. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనడంలేదు.. సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. పవన్.. చంద్రబాబు ఏజెంటు.. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో పాల్ రావచ్చు.. పవన్ కల్యాణ్ రావొచ్చు.. పోటీ చేయవచ్చు అన్నారు సజ్జల.. అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ లు మాట్లాడుతున్నారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చూసి ఇలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి.