అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ ఉద్యమంలో ఆయా ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేసేపనిలో పడిపోయింది అధికార పార్టీ.. ఇప్పటికే విశాఖ వేదికగా ఉత్రరాంధ్ర ప్రజలతో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనను విజయవంతం చేశారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన భారీ సభ నిర్వహిస్తున్నామని…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు మంత్రి దాడిశెట్టి రాజా.. తునిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రౌండ్ రియాలిటీ చంద్రబాబుకు అర్థమైపోయింది.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టాడని విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. అబద్దాలు చెప్పి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు.. పోలవరం దగ్గర చంద్రబాబు డ్రామా చేశాడని మండిపడ్డారు.. పట్టి సీమ పేరుతో దోచుకున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ఇక, పోలవరం ప్రాజెక్టు వైఎస్…
ఆపదలో ఉన్నాం.. ఆదుకొండి అంటూ వస్తే తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి.. వైద్యం చేయించుకోవడం కష్టమైన వారికి భరోసా ఇచ్చారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ విషయానికి ఆయన భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు…
మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా…
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై దాడి చెయ్యడానికి ప్రతి అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మద్యం స్కామ్ బయటకు తీశారన్న ఆయన.. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతో సాఫ్ట్ గా ఉంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురుపై కేసు పెట్టారు.. కానీ,…
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..…
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్…
మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు.. 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా.. మొహ్మద్ అలీ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో.. దయార్థ హృదయాన్ని చూపారు సీఎం.. వెంటనే బాధిత బాలుడి తల్లికి ఆర్థికంగా సాయం చేయాలని, నెలవారి పెన్షన్ వచ్చేలా చూడాలని.. ఆ చిన్నారికి మెరుగైన…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం…
ఉపాధ్యాయుల విధుల విషయంలో కీలక సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది.. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది.. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో మంత్రుల సంతకాలు కూడా పూర్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విధుల సవరణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి…