సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. పెన్షన్ దారులకు ఆనందాన్నిచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రూ. 2,500 నుంచి రూ. రూ. 2,750కు పెంచేందుకు నిర్ణయించాం.. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 134 కోట్లు ఖర్చు అవుతుందని.. అయినే.. సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.. నిజం ఎలా ఉంటుందంటే.. జగన్‌లా ఉంటుందని అంతా అనుకుంటారు. వివిధ సంక్షేమం పథకాలు అందని అర్హులకు ఆ ఫలాలు అందిస్తున్నాం.. ఈ నెల 27వ తేదీన ఆ పథకాలు అర్హులుగా గుర్తించిన వారికి అందచేయనున్నాం. ఉచిత పంటల భీమాలో సవరణలకు ఆమోదం తెలిపాం.. వైఎస్సార్ పశు భీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని.. గతంలో వైఎస్సార్ పశు నష్ట పరిహారం పేరును పశు భీమాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
Read Also: MLC Anantha Babu: జైలు నుంచి అనంతబాబు విడుదల వాయిదా.. కారణం ఇదే..!
ఇక, వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు మంత్రి వేణుగోపాల్.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ విధానానికి అంగీకారం లభించింది.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. హైడ్రో పవర్ స్టోరేజ్ ప్రాజెక్టును ఎవరు పెట్టాలనుకున్నా.. అనుమతులు ఇవ్వడానికి మేం సిద్ధమని స్పష్టం చేశారు.. జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోందని.. బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఏర్పాటు చేస్తాంచేయనున్నట్టు పేర్కొన్నారు.
ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతోన్న పిల్లలకు కంటెంట్ ఉన్న ట్యాబ్‌లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు మంత్రి వేణుగోపాల్.. ఉచితంగా శ్యాంసంగ్ ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్న ఆయన.. విద్యార్థులకు.. ఉపాధ్యాయులకూ ట్యాబులను పంపిణీ చేస్తున్నాం… విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దడం జగన్ ఒక్కరికే సాధ్యం అని స్పష్టం చేశారు.. మూతపడిన చిత్తూరు డెయిరీని పునరుద్దరించేందుకు చర్యలకు కేబినెట్ ఆమోదం లభించింది.. చిత్తూరు డెయిరీ పునరుద్దరణ బాధ్యతలు ఆమూల్‌కు అప్పగిస్తూ నిర్ణయించామన్నారు.. చంద్రబాబు హయాంలో మూతపడ్డ చిత్తూరు డెయిరీని తిరిగి పునరుద్దరిస్తామన్నారు.. మరోవైపు.. జనాభా లెక్కలు, ఎన్నికల విధులు టీచర్లు నిర్వహించరు అని స్పస్టం చేశారు మంత్రి వేణుగోపాల్.. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉందా..? లేదా..? వంటి పనులు బోధన పరిధిలోకే వస్తాయన్న ఆయన.. పాఠశాల పరిధిలో ఏం చెప్పినా బోధనే.. ఏం చెప్పినా పాఠమే అవుతుందన్నారు..