రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యానాథ్.. 52 మంది మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు.. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ.. రెండో టర్మ్‌లో తొలి నిర్ణయం తీసుకున్నారు యోగి. ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో.. రాష్ట్రంలో మొత్తం 15 కోట్ల మందికి లబ్ధి పొందనున్నారు.. కోవిడ్ మహమ్మారి సమయంలో…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకుంది భారతీయ జనతా పార్టీ… ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించారు యోగి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్…
యూపీకి రెండో సారి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే లక్నో స్టేడియంలో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు విశేషం. అంతేకాకుండా పలువురు బాలీవుడ్ నటులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కాగా, డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కేశవ్ ప్రసాద్…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. అమిత్ షా సమక్షంలో.. యోగి ఆధిత్యనాథ్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. రెండోసారి యూపీలో విజయం సాధించి… బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు అమిత్ షా. ఇక, తర్వాత గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను కలిసి…
వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. యోగికి ఓటు వేయకుంటే బుల్‌డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని ఆయన అన్నారు. యోగి అదిత్యనాథ్‌కు ఓటు వేయని ప్రాంతాలను…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈరోజు నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, మొదటిదశ ఎన్నికల్లో నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అందర్నీ అకట్టుకున్నాడు. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తరహా వేషధారణ ధరించిన ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ నోయిడాలోని సెక్టార్ 11 పోలింగ్ బూత్ వద్దకు వచ్చాడు. ఆయన్ను…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.. సమాజ్‌వాది పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ నేతలు తలకు పెట్టుకునే ఎరుపు టోపీనే టార్గెట్ చేసిన ఆయన.. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని ఆరోపణలు గుప్పించారు.. ఇదే సమయంలో 1500 మందికి పైగా హిందువులను జైళ్లలో పెట్టారని.. సమాజ్‌వాదీ పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారంటూ వ్యాఖ్యానించారు..…
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2017లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.. బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనలో ఏకంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.. దీనికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత కావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ ఘటనలో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, దీనికి బాధ్యున్ని చేస్తూ డాక్టర్ కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు.. ఆయన చివరకు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది..…
అసలే ఎన్నికల టైం. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతుంటాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఇవాళ పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో భాగంగా శనివారం 60 వేలమందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు అందజేసింది. వీటిని అందుకున్న విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి…
దీపావళి సందర్భంగా నవంబర్ 3న అయోధ్యలో జరిగే దీపోత్సవ్‌కు యోగి ఆదిత్యనాథ్ గౌరవనీయమైన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. అయోధ్య నగరం అంతటా 12 లక్షల దీపాలు (మట్టి దీపాలు) వెలిగించి ఈ వేడుక రికార్డు సృష్టించనుంది. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాట్ వద్ద సుమారు 9 లక్షల దీపాలు, నగరంలోని వివిధ ప్రదేశాలలో 3 లక్షల దీపాలను…