Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.
CM Yogi Adityanath comments on congress protested wearing black clothes: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భనం, జీఎస్టీ రేట్లపై నిరసన తెలిపాయి. నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి వంటి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు…
Ayodhya Ram Temple: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఎళ్లుగా కోర్టులో పెండింగ్ ఈ సమస్య 2019లో సుప్రీం కోర్టు ముగింపు పలికింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో రామ జన్మభూమికి అనుకూలంగా 2019లో తీర్పు వెలువరించారు.
Communal clashes in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉత్తర్ ప్రదేశ్ లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగీ ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఈ ఆందోళనలను అదుపు చేశారు. అయితే తాజాగా మరోసారి యూపీలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది.
గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాన్పూర్ లో హింస చెలరేగింది. కొంతమంది రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం కాన్పూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్…
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేశారు.. ఇక, ఈ మధ్యే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో మరోసారి సీఎం అయ్యారు.. అయితే, యూపీ డీజీపీ ముకుల్ గోయల్‌పై వేటు వేశారు సీఎం యోగి.. ముకుల్ గోయల్‌ను విధుల నుంచి అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు.. తమ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే యోగీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. Read…