Temple Umbrell controversy in Tamilnadu: తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ప్రజలతో మమేకం అవుతుంటారు. తాజాగా ఆయన కుటుంబం ఓ వివాదంలో ఇరుక్కునిపోయింది. చెన్నై నగరంలోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. సీఎం సతీమణి కోసం ఆలయ ఛత్రాన్ని వాడారంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని దుర్గాస్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఉపయోగించడం దేవాదాయ శాఖలో జరిగిన ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శించారు.
చెన్నై శివారు తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయంలో జరిగిన వేడుకల్లో ఆదివారం ఉదయం ఉత్సవమూర్తి ఊరేగింపు ఆలయ మాఢవీధిలో జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరే గించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చారు. ఆ ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రంపట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు.
Read Also: ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా అందుకొని దర్శకులు..
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టించింది. ఈ విషయమై ఆలయ సిబ్బందిని వివరణ కోరగా.. దుర్గా స్టాలిన్ వానలో తడవకుండా ఉండేందుకు ఆలయ ఛత్రాన్ని పట్టాలని అడగలేదని, ఆలయ ఉద్యోగి ఆ గొడుగును ఉత్సవమూర్తి వెనుక తీసుకెళుతుండగా ముందు వైపు ఆమె వేగంగా నడిచి వెళ్లారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు కుమారుడికి మంత్రి పదవి ఇచ్చారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్… డిసెంబరు 14తేదీన మంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఉదయ నిధి స్టాలిన్…చేపాక్ నుండి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉదయనిధి స్టాలిన్.
Read Also: Missed Calls Fraud: మిస్డ్ కాల్ వచ్చింది.. కట్టలు పోయాయి..