ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో.. దేశాల్లోనూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు.. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, వైఎస్ జగన్‌కి నా హృదయపూర్వక అభినందనలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా.. ఆ జగన్నాథుడు మరియు వేంకటేశ్వరుడు మీ మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం మీపై వారి ఆశీస్సులు మరియు మీ చైతన్యవంతమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగ, శ్రేయస్సు పథంలో నడిపించడానికి మీకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను అంటూ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ విషెస్ చెప్పారు..
ఇక, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి హృదయపూర్వక నమస్కారాలు… 50వ పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు ఎల్లప్పుడూ శాంతి, మంచి ఆరోగ్యం మరియు ఆనందం కలగాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇక, ఏపీ మంత్రులు, వైసీపీ శ్రేణులు.. సీఎంను కలిసి కొందరు.. సోషల్ మీడియా వేదికగా మరికొందరు.. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అన్నదాన కార్యక్రమాలు, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీఎం జగన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన సంబరాలు జరిగాయి.. సీఎంకు వేద ఆశీర్వాదం ఇచ్చారు టీటీడీ వేద పండితులు.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు.. ఆ తర్వాత సీఎం జగన్‌తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, వనిత, విడదల రజిని, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు.. మరోవైపు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.. జగన్ ప్రస్థానం మొత్తం ముళ్లబాటే.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కష్టాలు పడ్డారన్న ఆయన.. వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లక్యం వీడకుండా జగన్ ముందుకు సాగుతున్నారని.. జగన్ వేసే ప్రతి అడుగులో విశ్వసనీయత కనిపిస్తుందని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2022
I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh, on his 50th Birthday. pic.twitter.com/9ehsGYABOV
— governorap (@governorap) December 21, 2022
Birthday greetings to @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2022
Hearty Greetings to Hon'ble Chief Minister of Andhra Pradesh Thiru. @ysjagan on his 50th Birthday.
Wishing you peace, good health and happiness always on this special day.
— M.K.Stalin (@mkstalin) December 21, 2022