గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు మార్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు. Also Read: India…
CM Revanth Reddy meeting with Collectors and SP’s Today: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా…
Hyderabad:నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు శనివారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గి,…
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు.
మైనార్టీలకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సేమి క్రిస్మస్ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మత సామరస్యాన్ని కాపాడేందుకు శయా శక్తుల ప్రయత్నం చేస్తాం. దేశంలో మైనార్టీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. నేను చెప్పింది వాస్తవం. ప్రపంచానికి డిసెంబర్ నెల మిరకిల్ మంత్. పాపులను కాపాడాడు యేసు క్రీస్తు. మైనార్టీ…
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పేరుకుపోయిన చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లపై ఈ డిస్కౌంట్ కొనసాగనుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.. ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కఠోర దీక్షతో తెలంగాణాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి అని రేవంత్ రెడ్డిసూచించారు.
పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా కొనసాగుతున్నాయి. విద్యుత్ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎంఐంఎం మధ్య రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మొదటిసారి వచ్చిన సభ్యుడు పొరపాటుగా మాట్లాడితే.. అలా కాదు అని చెప్పాలి.. కానీ అక్బరుద్దీన్.. వ్యాఖ్యలు సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. భాష, విషయం ఉందని సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు.