CM Revanth Review: సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు,
Breaking News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. రేపటి (శనివారం) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.
CM Revanth Reddy: ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్గా మారింది. ప్రజా భవన్ గేట్లు తెరిచి ఉన్నాయి. దశాబ్దం తర్వాత సామాన్యుడి అడుగులు పడిపోయాయి.
Free Bus Travel in Telangana: రేపటి నుంచి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరిగింది.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దల సమక్షంలో తెలంగాణకు రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చాడు. రజినీకి ఉద్యోగం ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు. అంతేకాకుండా.. ప్రమాణస్వీకార వేదిక మీదనే రజినీకి నియామక పత్రాన్ని అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా.. దివ్యాంగురాలు…
'తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా బి.శివధర్రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.