నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చెయ్యాల్సిన పథకాలతో పాటు పథకాల అమలు తీరు, పాలన ఎలా కొనసాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? టీఎస్పీఎస్సీ పరిస్థితి ఏంటి? ఉద్యోగాల భర్తీ ఎలా చేయాలి? లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Indian Police Force OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుంచి భారీగా తీసుకుంది. వాటిపై ఇవాళ కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 17 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేస్తుంది.. తద్వారా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీనిపై కూడా నేటి మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: Astrology: జనవరి 08, సోమవారం దినఫలాలు
అలాగే, ప్రజాపాలనలో ఏకంగా కోటి 24 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో.. వారందరూ 6 హామీల కోసం వేచి చూస్తున్నారు.. వంద రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామన్న హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ హామీలను చెప్పిన విధంగా అమలు చెయ్యకపోతే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ప్రజలు షాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.