త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా.. ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాజీ సీఎం సీఎం కేసీఆర్‌ను…
నూతన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆయన పనులు మొదలుపెట్టారు. ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకొని నెరవేరుస్తున్నారు. ఎప్పటినుంచో మాట ఇచ్చిన ప్రకారం మొట్టమొదటి సంతకం రజినీ ఫైల్ మీదనే పెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచారు.
Rythu Bandhu Distribution Starts From Today in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచి పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయశాఖపై…
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.