Sonia Gandhi Birthday: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె పుట్టిన రోజునే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారని గుర్తు చేశారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
CM Revanth Reddy: డిసెంబర్ 7న తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన బ్రాండ్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఫైనల్గా కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్రెడ్డి.. నిన్న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశమైన రేవంత్రెడ్డి.. ఎవరికి ? ఏ శాఖ కేటాయించాలి అనే దానిపై చర్చించి వచ్చారు.. అయితే, మంత్రులకు శాఖలు ఈ శాఖలు కేటాయించారు
TSRTC Free Bus: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. టీఎస్ఆర్టీసీ కూడా ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
Mahesh Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నిన్ననే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రజా దర్బార్ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. జిల్లాకు ఒక టీంని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. ప్రజా దర్బార్ కి రోజుకు ఒక ఎమ్మెల్యే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక ప్రజాభవన్ లో మంత్రి సీతక్క వినతి పత్రాలు స్వీకరించారు.
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
CMD Prabhakar Rao:సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యుత్ పై సమీక్షకు ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు రావాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం.