Coca Cola : తెలంగాణలో కొత్త ప్లాంట్లపై కోకో కోలా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కూల్ డ్రింక్స్ తయారీ చేసే హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (HCCB) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం సెక్రెటేరియట్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకో కోలా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది.
Also Read
తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగినంత సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని అన్నారు. హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (హెచ్‌సీసీబీ) పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!