Bhatti Vikramarka: సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే భట్టి మూడు శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తు సంతకాలు చేశారు.
Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుంది అని నేను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని అనలేదని,
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు…
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధరణిపై సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెవిన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల్లో…
రాచకొండ పోలీసు కమిషనర్ గా జి. సుధీర్ బాబును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సీపీడీఎస్ చౌహన్ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు.. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం.. ప్రజలకు ఎల్లవేళలా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారు సీఎం రేవంత్. కాగా.. ధరణి పై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ధరణి రద్దు..? సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దుస్ప్రచారమ్ చేసిందని మండిపడ్డారు.
CM Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.
Revanth Reddy: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో మిగిలిన నాలుగు హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.