తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవొచ్చు అని తెలిపారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే నిన్న ( మంగళవారం ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఇవాళ నలుగురు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇస్తున్నారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు టాక్.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు…
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లతో సవివరంగా చర్చించారు. వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి లండన్ నుంచి దుబాయ్ వెళ్లారు. బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలు ప్రధానంగా 56-కిమీ పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం మరియు వాణిజ్య అనుసంధానాలు మరియు పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. అధికారిక ప్రకటన ప్రకారం, దుబాయ్‌లోని సమావేశాలు 70కి పైగా విభిన్న…
CM Ravanth Reddy: దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ టూర్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు..
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను…