Prajapalana:ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రధాని మోడీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించనున్నట్టు సమాచారం. Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం కాగా…
Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానితో భేటీపై స్పందించారు. ‘ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆయనతో చర్చించాం. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. తెలంగాణకు రావాల్సిన వాటిని…
Delhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఢిల్లీలోని ప్రదాని నివాసానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం మోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించన్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చ, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇతర అంశాలపై…
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొత్త ప్రభుత్వాన్ని శుభకాంక్షలు తెలిపారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదన్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలని, అప్పటి వరకు వేచి చూస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్రం సాయం…
Chiranjeevi Meets CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి కలిశారు. ఇక వీరి కలయికకు సంబంధించిన పొటోలు,వీడియో వైరల్‌గా మారాయి. నిజానికి రేవంత్‌రెడ్డిను సీఎంగా ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా అభినందించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 7న సీఎంతో…
రేపు ఢిల్లీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ వాయిదా పడింది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేపీ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది అంటూ విమర్శలు గుప్పించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని పేర్కొన్నారు.