ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లో రెండు పథకాలు అమలు చేసామని, 14 కోట్ల 25 లక్షల మంది జీరో టిక్కెట్ తో మహిళలు బస్సుల్లో ప్రయాణించారన్నారు. హామీ ఇచ్చారు. అవాకులు చెవాకులు పేల్చారో వారి నోటికి ప్లాస్టర్ వేసేలా మరో రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. కుల గణనకు ఆమోదం తెలిపామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా రాష్ట్ర గేయంగా మార్చుతూ ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు. రాచరిక పాలన గుర్తులను చేరిపి వేస్తూ తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంకు ఆమోదించినట్లు, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఆమోదం, టీఎస్ నుంచి టీజీగా మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత బీఏసీలో నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరో రెండు గ్యారంటీల హామీల అమలుపై కేబినెట్ చర్చించింది. రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళారూపాలను పునరుజ్జీవింపజేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని కేబినేట్ తీర్మానం చేసింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చాలని తీర్మానించారు. రాజరిక పాలన గుర్తులు లేకుండా మన ప్రాంతం, ప్రజలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని పోరాటాలకు, త్యాగాల చిహ్నంగా రూపుదిద్దాలని నిర్ణయం జరిగింది. దీని కోసం కళాకారుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లలో తెలంగాణ పేరును సూచించే ‘టీఎస్’ అక్షరాలను ఇకపై ‘టీజీ’గా మార్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ల చట్టంలో అందుకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది. హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై కేబినేట్లో చర్చ జరిగింది. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కొడంగల్ ఏరియా డెవెలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని (65) ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తారు.’ అని వ్యాఖ్యానించారు.