CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో ఆయన పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే సభకి సీఎం హాజరు కానున్నారు. అనంతరం రాహుల్‌గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరారు. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహించారు. వీరంతా సమీర్ పేటలోని లియోని రిసార్ట్‌లో ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం నుంచి తమ రాష్ట్రానికి వెళ్లినవిషయం తెలిసిందే. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లారు. దీంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించాల్సి ఉండగా.. ఈ మేరకు ముందుగా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. కానీ జార్ఖండ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా కొడంగల్ పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్లనున్నారు.
జార్ఖండ్ ఎమ్మెల్యేలకు గట్టి భద్రత..
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను రెండు రోజులు ముందే హైదరాబాద్ శివారులోని సమీర్‌పేటలోని రిసార్ట్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం రాంచీకి కూడా వెళ్తారు. రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌లు వారి భద్రతా విధులను పర్యవేక్షిస్తున్నారు.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
తాజావార్తలు
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!