దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ అందరినీ ఆకర్షిస్తోంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్‌తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్… మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం…
న్యాయ విచారణకు ఆదేశించే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేషన్ మరియు నిర్వహణతో సహా దర్యాప్తు, డిజైన్ మరియు అమలులో ఉన్న లోపాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి సాంకేతికతలను ధృవీకరించాలని పలువురు నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు . దర్యాప్తులో లోపాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి ఆదేశించాలని ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలోని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ-డిజైనింగ్ దశ (ఇంతకుముందు ఇదే ప్రయోజనం కోసం రూపొందించబడింది) మరియు దాని…
తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం…
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో…
హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం…
NVSS Prabhakar: ఒకే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు సార్లు డిల్లీకి వెళ్ళారు.. రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaushik Reddy: మానికం టాగూర్ పై మేము సొంత ఆరోపణలు చేయలేదని కోమటి రెడ్డి సోదరులు చెప్పిందే మేము చెప్పామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
CM Revanth Reddy: నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ...
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం…