తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. ఇందులో టీఎస్పీఎస్సీ సెక్రెటరీగా నవీన్ నికోలస్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా అనిత రామచంద్రన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా హనుమంతరావు ఉన్నారు.
Read Also: Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
అలాగే, బీసీ వెల్ఫేర్ కమీషనర్ గా బాలమాయదేవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు హార్టీ కల్చరర్ డైరెక్టర్ గా అశోక్ రెడ్డి, ఫిషరీస్ కమీషనర్ గా బి. గోపి, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమీషనర్ గా నిర్మల కాంతి వెస్లీ, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సీతా లక్ష్మీ, ఛీఫ్ రేషనింగ్ గా ఫనీంధ్రను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.