రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్సాగర్…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని…
మా ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి తన్నారు.. ఇది న్యాయమేనా..? విశాఖలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు. కాగా.. ఆ వీడియోపై స్పందించిన…
సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజ నర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
Jagga Reddy: ఒక వేల గెలిచి ఉంటే సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి సంగారెడ్డిలో అభివృద్ధి కోసం నాకు ఇన్ని కోట్లు కావాలని నేరుగా అడిగేవాడిని అని.. కానీ ఇప్పుడు ఏ మొఖం..
Venkatesh: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి బ్రదర్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు .. శనివారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం తో దగ్గుబాటి బ్రదర్స్ కొద్దిసేపు ముచ్చటించారు.
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.