Hyderabad: హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది.. దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ కావాలని విజిలెన్స్ అధికారులు కోరారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, స్టోరేజ్ బిల్డింగ్స్ పలు వెంచర్లకు అనుమతించిన ఫైల్స్ పరిశీలించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. కాగా.. ఉదయం 7 గంటల నుండి మైత్రివనంలోని 4వ అంతస్తు హెచ్ఎండీఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో.. అన్ని ఫైళ్లను అధికారులు సీజ్ చేశారు.
Read Also: Ghantasala Daughter: నాటు వైద్యం.. స్టేజిపైనే నాన్నగారికి గుండెపోటు.. ఆరోజు ఇప్పటికీ మర్చిపోలేను
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కాగా.. సోదాలు చేపట్టిన విజిలెన్స్ నిఘా టీం అరెస్ట్ వారెంట్ తో వెళ్లింది. హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై ఆరా తీశారు. ఇదిలా ఉంటే.. రేపు జీహెచ్ఎంసీ, ఎల్లుండి డిస్టిక్ టౌన్ ప్లానింగ్ డీటీపీసీ కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు జరుపుతుందని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే.. విజిలెన్స్ సోదాలు చేపట్టింది.
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా.. అక్రమ లేఅవుట్, బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Chinese flag on Isro ad: డీఎంకే ఇస్రో ప్రకటనలో “చైనా జెండా”.. బీజేపీ తీవ్ర విమర్శలు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!