శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల్లో…
త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత…
రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు.
తెలంగాణ ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను,…
ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ బలగం అనే పేరుతో BRS సోషల్ మీడియా ఇకపై ఉంటుందన్నారు. జిల్లా కమిటీలు లేవు… వేస్తమని, ఫిబ్రవరి రెండవ వారంలో సార్వత్రిక…
Telangana Shakatam: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు సమాయత్తమవుతున్నాయి.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) అందరూ తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు.. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.