తెలంగాణకు బీజేపీ ఏమీ చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టబోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ది మీద, అవినీతి మీద చర్చ లేదు.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు విపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మరక లేకుండా మోడీ పాలన చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 15 రోజులుగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.
అభివృద్ధి ఎజెండాతో మోడీ ఎన్నికలకు వెళ్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. కానీ విపక్షాలు అభివృద్ధి అంశాలను చర్చలోకి రానివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది.. వీటిపై చర్చకు సిద్ధమా..? వీటిపై చర్చించి ఎన్నికలకు పోయే దమ్ముందా..? అని ప్రశ్నించారు. సీఏఏ పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఇస్లాం దేశాల్లో జైనులు, పార్శీలు, ఇతర హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిపై అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోలేదు.. వాటిపై మాట్లాడరు.. కానీ ముస్లింలకు వ్యతిరేకంగా సీఏఏ ఉందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Marriage: పెళ్లి వేడుకలో ఊడిపోయిన విగ్గు.. బయటపడిన బండారం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
విమోచన దినోత్సవం ఒక చరిత్ర.. దీన్ని కూడా చిన్నచూపు చూశారు..కానీ కేంద్రం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేసిందనిన లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారు.. వీటిపై చర్చలకు పోయి ఎన్నికలకు రాకుండా.. తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 15, 16, 18 తేదీల్లో తెలంగాణకు మోడీ వస్తున్నారు.. మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల సభలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో లెక్కలతో సహ చెబుతాం అని పేర్కొన్నారు. ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తామంటే కుదరదు.. తర్వాత అమలు చేస్తామనంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని లక్ష్మణ్ తెలిపారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ మా సర్కార్ ను కూలగొట్టాలని చూస్తున్నాయని అంటున్నారు.. ఎన్నికల ద్వారానే తాము అధికారంలోకి వస్తాం.. కూలగొట్టి కాదని అన్నారు.
అరూరి రమేష్ బీజేపీలో చేరతారా లేదా అనేది తనకు తెలియదన్నారు. ఆయన తనకు.. తారసపడ్డారు.. కానీ తనను కలవలేదని చెప్పారు. రాజాసింగ్.. వ్యవహారంలో అనుమానం అక్కర్లేదు.. ఆయన నిబద్ధత కలిగిన నేత.. ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను వినియోగించుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. దాడి చేసిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని తమ నేతలు ప్రశ్నిస్తే.. వారికి జవాబు చెబుతాం పార్టీ అన్ని కోణాల్లో ఆలోచన చేసే చేర్చుకుంటోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటాం.. కానీ కాపాడుకుంటారో లేదు వాళ్ళు చూసుకోవాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం ఖాయం… రాహుల్ ప్రధాని అవుతాడని రేవంత్ రెడ్డి చెప్పగలరా… దీనిపై రెఫరెండంకి తాము రెడీ అని లక్ష్మణ్ తెలిపారు.
TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..