Dr K Laxman: ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ డా.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషిష్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన “హెల్తీ బేబీ కిట్స్” ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలని ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. పోషకాహార లోపంతో ఎవరూ కూడా ఇబ్బంది పదొద్ధని ప్రతి చిన్న పిల్లలకు అందేలా పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మహిళలు నేడు విమానాలు నడిపే స్థాయికి వచ్చారన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి ప్రేమను పొందిన వ్యక్తి మన మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాని ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read also: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర CSR నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా స్టాఫ్ కు టీచర్స్ కు అవసరమయ్యే ఫర్నిచర్ ను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూలీ చేసుకునే పేదవారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో DSC ద్వారా నియమితులైన టీచర్లు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోప పూరిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లో క్రమేణా పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. రెండు, మూడు వందల పిల్లలు ఉన్న పాఠశాలల్లో కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారన్నారు. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇప్పుడు వారైనా సరిపడా టీచర్లను నియమించి, పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!