Dr K Laxman: రేవంత్ రెడ్డి పై మరోసారి స్పందించిన బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలను చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. మాతృ మూర్తుల కోసం ప్రధాని పౌష్ఠిక ఆహారం పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందనేది అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తుందన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం కూలీ పోవాలని బీజేపీ కోరుకోవడం లేదన్నారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం పడిపోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు వచ్చి కలుస్తున్నారని తెలిపారు. మా ప్రభుత్వానికి అండగా ఉంటామని చెబుతున్నారని రేవంత్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కి ఎందుకు అంత అభద్రతా భావం ఉంది? అని ప్రశ్నించారు.
Read also: Virat Kohli-IPL 2024: ఆర్‌సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీ లు అమలు చేసి సజావుగా పాలించాలని బీజేపీ కోరుకుంటుందన్నారు. కానీ మీ వైఫల్యాలను చూసి ప్రజల తిరుగుబాటుకు దారి తీస్తే మాత్రం.. మిమ్మల్ని కాపాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పడం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని తెలుస్తుందన్నారు. కానీ.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి మాపై కుట్రలు పన్నుతున్నారని మీరే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీతో ఉన్నారు, కాబట్టి ప్రజలకు అర్థం అవుతుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని.. అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మోడీ నాయకత్వం చూస్తున్నారన్నారు. ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉందన్నారు. మీ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి బి అర్ ఎస్ ను హక్కున చేర్చుకుంటామంటే మాకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. మీరు బీఆర్ఎస్ ఒక్కటైనా.. మోడి నాయకత్వంలో ప్రజలు మా వెంట ఉన్నారని తెలిపారు. కాబట్టి దేశ వ్యాప్తంగా 400 పై సీట్లు సాధించి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
Karishma kapoor: నా భర్త నన్ను వేలం వేశాడు.. కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్య..!
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!