కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..
ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో సహా హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశాలు వున్నాయి. కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈడీ ఆమె భర్త అనిల్‌కు నోటీసులు పంపింది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల్లో గెలవకపోతే రక్తపాతం తప్పదు.. బెదిరించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్తపాతం చేస్తానని బెదిరించారు. ఒహియోలో జరిగిన బహిరంగ సభలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈసారి తనను ఎన్నుకోకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని అన్నారు. అమెరికా చరిత్రలో ఈసారి ఎన్నికల తేదీ అత్యంత కీలకం కానుందని ట్రంప్ అన్నారు. డైటన్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ ఊహించిన నామినీగా చేసింది. అమెరికా ఆటో పరిశ్రమ గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇదిలా ఉండగా రక్తపాతానికి సంబంధించి ఓ ప్రకటన కూడా ఇచ్చాడు. మీరు నవంబర్ 5వ తేదీని నోట్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన తేదీ కానుంది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు జో బిడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని ఆయన అన్నారు.
ప్రజా గళం సభకు ఏర్పాట్లు పూర్తి..
పల్నాడు లో ప్రజా గళం పేరుతో ఉమ్మడి పార్టీలు నిర్వహిస్తున్న భారీ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి… …. చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రాంతంలో నేడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించే తొలి బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు… ఈ సభలో ఉమ్మడి పార్టీల అధినేతలు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లు పాల్గొని ప్రసంగిస్తారు … లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు . .300 ఎకరాల ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదిక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు… ఈ సభ ద్వారా 2024 ఎన్నికల ప్రచార నగరా మోగించడానికి ఉమ్మడి పార్టీలు సంసిద్ధమవుతున్నాయి…
అయోధ్య వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 24 గంటలు బాలరాముడి దర్శనం..!
అయోధ్యకు రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రస్టు అధికారులు ముందస్తు దర్శన సమయాన్ని పెంచారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయాన్ని నిర్మించిన తర్వాత, బలరాముడి మరణానంతరం మొదటిసారిగా శ్రీరాముని పుట్టినరోజు జరుపుకునే సమయం వచ్చింది. కాగా.. అయోధ్యలో మరోసారి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ట్రస్టు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న శ్రీరాముని పుట్టినరోజు సందర్భంగా.. 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. బలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో జరగనున్న తొలి కార్యక్రమం ఇదే కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ట్రస్టు అంచనా వేస్తోంది. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వారందరికీ బలరాముడి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు! ఒక్కో పోస్టుకు 715 మంది..!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. ఆ తర్వాత మరో రెండు రోజులు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. ఈ పోస్టులు ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. శనివారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. దీంతో మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోగా, హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను రద్దు చేశారు. ఫలితంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
మోడీ అప్పులు పాలు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు
రాష్ట్రానికి, దేశానికి జగన్ మోడీ రాహుకేతువుల్లా తయారయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ గా దేశాన్ని బీజేపీ తయారుచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అప్పులుపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడని, రాష్ట్రాన్ని జగన్ రుణాంద్రప్రదేశ్ గా మార్చాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తాలిబన్ల పాలనను మించిపోయిందని, మాఫియా రాష్ట్రంగా, డ్రగ్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని జగన్ మార్చేశాడని తులసి రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పాలన అప్పులు ఫుల్, అవినీతి ఫుల్ గా మారిందని, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయని, ఈ మూడు పార్టీలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈడినట్లే వుంటుందన్నారు. అంతేకాకుండా.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. రూ.50వేలకు మించితే సీజ్
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6తో కోడ్ పూర్తవుతుంది.. అంటే మొత్తం 80 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తయినప్పటికీ, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు రిజర్వు చేయబడ్డాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీఆర్‌ఎస్ కు బిగ్ షాక్.. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా..!
ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో సంచలన షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి వరకు పార్టీలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ఇన్ని రోజులు చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
కాంగ్రెస్ లేకుంటేస్వాతంత్య్రం వచ్చేది కాదు.. బీజేపీ లేకుంటే అల్లర్లు జరిగేవి కావు : సంజయ్ రౌత్
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ లేకుంటే దేశానికి నాయకత్వం వచ్చేది కాదని ఉద్ధవ్ థాకరే (UTB) గ్రూపునకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు. కాంగ్రెస్ లేకుంటే పాకిస్థాన్ రెండు ముక్కలు అయ్యేది కాదని రౌత్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతి కాంగ్రెస్ వల్లనే జరిగిందన్నారు. నిజానికి ‘కాంగ్రెస్ లేకుంటే ఏమై ఉండేదో’ అనే పుస్తకాన్ని బీజేపీ విడుదల చేస్తోంది.
కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా..
కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా.. అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్పోరేషన్ లకు ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత జీరో బిల్లు అవ్వండి అని మాకు నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన నువెం పన్నీరు కాదంటూ హరీష్ రావుకు చురకలంటించారు. నువ్వు కూడా ఎక్కువ రోజులు ఆ సీటులో ఉండవు అంటూ హెచ్చరించారు. అన్ని గంజాయి మొక్కలు పీకి పడేస్తా అన్నారు. ఫార్మ్ హౌస్ లో ఉండి ఆదేశాలు జారీ చేస్తే అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. అన్నిటినీ సెట్ చేస్తా అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అంతా గ్రేటర్ పరిధిలోకి.. మాకు ప్రపంచం తోనే పోటీ అన్నారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు.. బిల్లులు మీ తాత కడతాడా? అని ప్రశ్నించారు. అప్పులు మేము చెప్తే.. ఆస్తులు వాళ్ళు చెప్పారని అన్నారు. మరి బకాయిలు ఎవడు కట్టాలి.. అవెందుకు చెప్పరు? అని ప్రశ్నించారు.