MP K. Laxman: మన దేశం లో ముస్లిం లు ఎంతో స్వేచ్చగా ఉన్నారు.. కేవలం అఘ్వనిస్తాన్, పాకిస్థాన్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన ముస్లిం లకు మాత్రమే CAA అడ్డుకుంటుందని రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని హమారా సంకల్ప్ వికసిత్ భారత్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ కార్యక్రమంలో భాగంగా హోటల్ కత్రియాలో ఏర్పాటు చేసిన అడ్వకేట్స్ మీట్ కార్యక్రమంలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ లీగల్ టీమ్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ప్రజల యొక్క మనోగతాన్ని తీసుకుని మ్యానిఫెస్టోలో తయారు చేయడానికి బీజేపీ సిద్ధం అయ్యిందన్నారు. అందులో భాగంగానే ప్రజలు, మేధావులు, వెనుక బడిన వర్గాల సలహాలు తీసుకోవడానికి ముందుకు వచ్చామన్నారు.
Read also: Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదు..
ఇది కేవలం బీజేపీ మ్యానిఫెస్టోలా కాకుండా ప్రజల మేనిఫెస్టో లా ఉండాలని నిర్ణయించామన్నారు. రాజకీయాల కోసం అమలు చేయలేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. అక్కడ పరిస్థితి చుస్తే హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టి వంద రోజులు కావస్తున్నా హామీలు అమలు కావడం లేదన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నామ మాత్రంగా పథకాలు ప్రారంభిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణా ఆర్థిక వ్యవస్థను అప్పుల్లో కురుకుపోయెలా చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి అన్నారు.
Read also: Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా నేనేంటో చూస్తారు..!
మరి ఈ ఆరు గ్యేంటీలు ఉచితాలు ఎలా నెరవేర్చే అవకాశం ఉందని ప్రకటించారని తెలిపారు. కనీసం ఆ హామీలకు నిధులు ఎలా సమకుర్చుతారో చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వేలం పాట లాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పథకాలు ప్రకటించారని మండిపడ్డారు. ఒకరు ఐదు వేలు ఇస్తా అంటే మరొకరు పది వేలు ఇస్తా అని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా పంచుకుంటూ పోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం స్వయం శక్తి పై ప్రజలు నిలబడే పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ముందుచూపు ఉన్న గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ అన్నారు. అందుకే ప్రజలకు ఏం అవసరమో ప్రజలనే అడిగి తెలుసుకోవాలి అని నిర్ణయించారన్నారు. ఈ దేశం లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేవలం కుటుంబం పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కోసం పని చేస్తున్నాయని తెలిపారు.
Read also: Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదు..
కేసీఆర్ తన కొడుకుని, కూతురిని, ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా లాలూ ప్రసాద్ యాదవ్, స్టాలిన్ లాంటి వారు వారి కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి పని చేస్తున్నారన్నారు. కానీ కేవలం దేశం కోసం ప్రజల కోసం పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. కొన్ని పార్టీలు CAA పై దృష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. CAA ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. కేవలం అఘ్వనిస్తాన్, పాకిస్థాన్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన ముస్లిం లకు మాత్రమే CAA అడ్డుకుంటుందని తెలిపారు. అంతే కానీ దేశం లో ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. మన దేశం లో ముస్లిం లు ఎంతో స్వేచ్చగా ఉన్నారని, దేశ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలనే మోడీకి సపోర్ట్ చేయాలన్నారు.
Danam Nagender: బీఆర్ఎస్ కు మరో షాక్.. దానం నాగేందర్ గుడ్ బై