MK Stalin: తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి చెందిన మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణను పెంచాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM MK Stalin: సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ…
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలను కలిపేందుకు ఈ సేతు సముద్రం ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గతంలో సేతు సముద్రం ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా దీనికి సపోర్టు చేసింది. అయితే రామసేతు నిర్మాణానికి ఎలాంటి హాని కలుగకుండా ఈ ప్రాజెక్టును ఏర్పాటు…
Annamalai criticized Udayanidhi Stalin as a playboy: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ..‘క్రౌన్ ప్రిన్స్ ప్లే బాయ్ గానే మిగిలిపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ప్లేబాయ్ గానే మిగిలిపోతాడంటూ విమర్శించారు. అన్నూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నామలై, డీఎంకే టార్గెట్…
College girl killed after being pushed in front of moving train in Chennai: చెన్నైలో దారుణం జరిగింది. ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతిని రైలు కింద తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. సత్యప్రియ,…
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోొవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
Subbulakshmi Jagadeesan quits DMK Party: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు పెద్ద షాక్ తగిలింది. పార్టీలో కీలక నేత, మాజీ కేంద్రమంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సబ్బులక్ష్మీ జదీశన్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్న సుబ్బులక్ష్మీ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్టాలిన్ కు తన రాజీనామాను సమర్పించారు. క్రియాశీలక రాజకీయం నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.
MK Stalin comments on hindi diwas: హిందీ భాషా దినోత్సవం ‘ హిందీ దివాస్’ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. బుధవారం సూరత్‌లో జరిగిన అఖిల భారత అధికార భాషా సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాష ఇతర భాషలకు పోటీదారు కాదని.. హిందీ అన్ని భాషలకు మిత్రుడని వ్యాఖ్యానించారు. కొందరు హిందీని గుజరాతీ, తమిళం, మరాఠీ భాషలకు పోటీదారుగా తప్పుగా భావిస్తున్నారని ఆయన వ్యాక్యానించారు. హిందీ అధికార భాషగా మొత్తం…