Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Police Gives Clearance On Vani Jayaram Death: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో.. ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే! దీంతో ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు రావడంతో.. ఆమె తలపై గాయాలవ్వడానికి గల కారణాలేంటో బహిర్గతమైంది. బెడ్రూంలో ఆమె కిందపడటంతో తలకు బలమైన దెబ్బ తగిలిందని, దాంతో ఆమె మృతి చెందిందని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను తాము క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో.. వాణీ మృతిపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.
Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా.. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన ఆమె.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న వాణీ.. తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం. మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది. అయితే.. ఆ పురస్కారాన్ని అందుకోకుండానే కన్నుమూశారు. వాణీ జయరాం 1968 ఫిబ్రవరి 4వ తేదీన జయరాంను వివాహం చేసుకున్నారు. సరిగ్గా అదే రోజు ఆమె మృతి చెందారు. వాణీ భర్త జయరాం 2018లోనే కన్నుమూశారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాణీ జయరాం ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు.
Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆమె అంతిమయాత్రలో అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం చోటు చేసుకోకుండా ఉండేందుకు, నగర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.
Jr NTR: అమిగోస్ ఈవెంట్ సాక్షిగా.. ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన ఎన్టీఆర్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!